జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అప్పట్నుంచేనా…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ కి సిద్ధమైపోతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి యాక్షన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి అరవింద సమేత వీరరాఘవ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రేంజ్ లో ఆ సినిమా లేకపోయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఇదే ఊపులో వీరిద్దరూ కలిసి మరో పొలిటికల్ యాక్షన్ డ్రామాకి తెరలేపారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో కలిసి ట్రిబుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోయాడు. లేదంటే ఈపాటికి ఈ సినిమా ఎప్పుడో బిగిన్ అయ్యేది. అయితే, ఇప్పుడు రాజమౌళి సినిమాకి త్వరలోనే ప్యాకప్ చెప్పి త్రివిక్రమ్ అండ్ టీమ్ తో జాయిన్ అయ్యేందుకు ఎన్టీఆర్ సిద్ధమయినట్లుగా సమారం తెలుస్తోంది. తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదిన ఈ సినిమా మొదలు కాబోతోందని టాక్ వినిపిస్తోంది.

కరోనా కాలంలో ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి వర్క్ చేసిన త్రివిక్రమ్ అండ్ టీమ్ షూటింగ్ ని చాలా స్మార్ట్ గా డిజైన్ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ హెవీగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక పాత్రలో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్డ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా రష్మిక మందన పేరు పరిశీలనలో ఉంది. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus