Evaru Meelo Koteeswarulu: టీవీ షో షూటింగ్ కి ఎన్టీఆర్ రెడీ!

Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో బిగ్ బాస్ షో ద్వారా చూశాం. ఎన్టీఆర్ వలనే బిగ్ బాస్ సీజన్ 1కి అప్పట్లో భారీ టీఆర్ఫీ రేటింగులు వచ్చాయి. తన అల్లరి, సరదా కామెంట్స్ తో షోని రక్తి కట్టించారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి ఎన్టీఆర్ ని హోస్ట్ గా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలోనే ఈ విషయాన్ని ప్రకటించారు.

కానీ కరోనా కారణంగా ఈ టీవీ షోకి బ్రేక్ పడింది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో బిజీ అయిపోతారని.. ఇప్పట్లో టీవీ షోని హోస్ట్ చేసే ఛాన్స్ లేదని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారట.

వచ్చే వారంలో ఈ టీవీ షో షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. దీనికోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్ ను నిర్మించారు. కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించిన తరువాత డేట్ అనౌన్స్ చేసి.. జెమినీ టీవీలో టెలికాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీలో పాపులర్ అయిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ఆధారంగా ఈ షోని రూపొందిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news