తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ నటుడు నందమూరి తారక రామారావు. ఆయన ఆశీసులతో చిత్రరంగంలో దమ్ము చూపుతున్ననటుడు ఎన్టీఆర్. సినిమాకు సినిమాకు పరిణితి సాధిస్తూ.. డాన్స్ లతో దూసుకు పోతున్న బాద్ షా పుట్టినరోజు సందర్భంగా ఆయన హిట్ సినిమాల గురించి..
ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన చిత్రం నిన్ను చూడాలని. పదిహేడేళ్లకే హీరో గా అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రముఖుల అభినందనలు అందుకున్నాడు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన తొలి సినిమా స్టూడెంట్ నెం.1. 2001 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మీసాలు కూడా పూర్తిగా రాని వయసులోనే ఆది మూవీలో తొడకొట్టి ఇండస్ట్రి రికార్డ్ లను బద్దలు కొట్టాడు. మూడవ సినిమాతోనే కమర్షియల్ హీరోగా మారాడు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన రెండో సినిమా సింహాద్రి. సింగమలై అంటూ కత్తి పట్టి నరుకుతుంటే కలక్షన్ల వర్షం కురిసింది. తాతా ఎన్టీఆర్ హోదాను పొందుతాడని అభిమానులు పొంగి పోయారు.
ఎన్టీఆర్ చెల్లెలు సెంటి మెంట్ తో చేసిన ఈ సినిమా మహిళా అందరికి బాగా నచ్చింది. ఇందులో ఎన్టీఆర్ నటన అదిరింది. రాఖీ రాఖీ అంటూ డాన్స్ లతో అదరగొట్టాడు.
తాత యమగోల కథ స్పూర్తితో ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన మూడో సినిమా యమదొంగ. ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ సాధించింది.
ద్విపాత్రభినయంతో ఎన్టీఆర్ అదుర్స్ అనిపించాడు. వీ వీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు.
కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందించేలా ఎన్టీఆర్ బృందావనం సినిమాను ఎంచుకున్నాడు. తనదైన శైలిలో నటించి మహిళలను థియేటర్లకు రప్పించాడు.
ఎన్టీఆర్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా టెంపర్. ఈ సినిమాలో సిక్స్ పాక్ తో కొత్తగా కనిపించాడు. తన ఇమేజ్ చట్రం నుంచి బయటికి వచ్చి ఈ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సాధించింది.
క్లాస్ పాత్రలను మరింత క్లాస్ గా చేయగలనని ఎన్టీఆర్ ఇందులో నిరూపించాడు. ఈ సినిమా మాస్ పీపుల్ కి నచ్చక పోయినా “ఎ” సెంటర్ లో బాగా ఆడింది.
తన బాడీ కి కరెక్ట్ గా సరి పోయే పాత్రలో కనిపించడానికి మరోసారి సిద్ధమయ్యాడు. జనతా గ్యారేజ్ ద్వారా హిట్ కొట్టడానికి వస్తున్నాడు.