Jr NTR New Car: ఎన్టీఆర్‌ గ్యారేజీలోకి కొత్త కారు వచ్చేసిందట!

ఎన్టీఆర్‌కి కార్లంటే పిచ్చి… అతని గ్యారేజ్‌లో ఎన్నికార్లో… ఛ కొత్త విషయం మరీ. ఎప్పటినుండీ తారక్‌ అంతే కదా అంటారా. అయితే ఆగండి… తారక్‌ కార్ల పిచ్చి ఏ రేంజికి వెళ్లిపోయిందో మీకు అర్థమయ్యేలా చెప్పే సమయం వచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని సోమవారం దేశంలో కొత్త కారును లాంచ్‌ చేసింది తెలుసా? పేరు ఉరుస్‌. అదిరిపోయే ఫీచర్లు, రంగులుతో కారు కళకళలాడిపోయింది. ఆ కారు తారక్‌ తీసేసుకున్నాడట. అదీ మేటర్‌

ఏంటీ సోమవారం లాంచ్‌ అయిన కారును… తారక్‌ మంగళవారం కొనేశాడా అంటారా? అదే కదా ఇక్కడ మేటర్‌. తారక్‌ కార్ల మేనియా ఏ రేంజిలో ఉంటుందో చాలామందికి తెలుసు. అయితే విడుదలైన రెండో రోజే కొనేశాడు తారక్‌ అని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌గా మారింది. లంబోర్గిని ఉరుస్‌ గ్రాఫైట్‌ క్యాప్సుల్‌ కారును ఎన్టీఆర్‌ కొనేశాడు అనేది ఆ వైరల్‌ వార్తల సారాంశం. అదిరిపోయింది కదూ.

తారక్‌కు కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజ్‌లో చాలా కార్లు ఉన్నాయి. వాటి నెంబరు ఎక్కువగా 9999 గానే ఉంటుంది. దీని కోసం ఆయన వివిధ జిల్లాల్లో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎలాగైనా ఆ నెంబరు సాధిస్తుంటాడు. ఇప్పుడు లంబోర్గిని ఉరుస్‌ కోసం ఆ నెంబరు ఎక్కడ, ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

1

2

3

4

5

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus