Vijay Devarakonda: విజయ్‌ – గౌతమ్‌ సినిమా.. ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు?

ఒక సినిమా రిలీజ్‌ డేట్‌ ఇంకో సినిమా మీద ఎఫెక్ట్‌ చూపిస్తుందా? అంటే కచ్చితంగా అవును అనే సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఎవరి సినిమా వారిది, ఎవరి వసూళ్లు వారివి. అయితే ఆ సినిమా పెద్ద హీరోది అయితే కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇంచుమించు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న చిత్రం విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)  – గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri)  సినిమా. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్‌ అనుకున్న డేట్‌కి వేరే సినిమాలు వస్తున్నాయి.

Vijay Devarakonda

మొన్నీమధ్యే అభిమానులకు ఆనందాన్నిస్తూ.. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) టీమ్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. దీంతోనే అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే ఆ సమయానికి వద్దామని విజయ్‌ దేవరకొండ కర్చీఫ్‌ వేసుకుని కూర్చుకున్నాడు. ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) సినిమాతో తీవ్రంగా నిరాశలో పడ్డ విజయ్‌.. గౌతమ్‌ సినిమా మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. డబుల్‌ రోయల్‌, డిఫరెంట్‌ గెటప్‌ అంటూ ప్రయోగాలు చేస్తున్నాడు.

సినిమా మీద నమ్మకం, డేట్‌ మీద నమ్మకంతో మార్చి 28న వస్తామని ప్రకటించేశారు. అయితే ఇప్పుడు అన్నీ అనుకున్నట్లుగా జరిగి ‘హరి హర వీరమల్లు’ ఆ డేట్‌కి వస్తే.. విజయ్‌ సైడ్‌ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ సినిమా నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) గతంలోనే ఈ విషయం చెప్పారు కూడా. పవన్‌ సినిమా వస్తే మేం సైడ్‌ అవుతాం అని. ఈ లెక్కన ఆ డేట్‌ విజయ్‌కి కష్టమే అని చెప్పొచ్చు.

పోనీ రెండు వారాల తర్వాత వద్దామని విజయ్‌ అనుకుంటే ఏప్రిల్ 10న ప్రభాస్ (Prabhas)  ‘ది రాజా సాబ్’ (The Rajasaab) రెడీగా అవుతున్నాడు. మొన్నీమధ్యే డేట్‌ అనౌన్స్‌ చేశారు. ఏప్రిల్‌ ఆఖరున వద్దామంటే తేజ సజ్జా (Teja Sajja) – మంచు మనోజ్‌ (Manchu Manoj) ‘మిరాయ్’ (Mirai) ఉండనే ఉంది. దీంతో మార్చి మిస్‌ అయితే విజయ్‌ మే లేదా జూన్‌కి వెళ్లడం ఒక్కటే మార్గం అని అర్థమవుతోంది. మరి నాగవంశీ అండ్‌ టీమ్‌ ఏం ప్లాన్‌ చేస్తారో చూడాలి. ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం మాత్రం విజయ్‌కి, గౌతమ్‌కి అత్యవసరం.

సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ కటౌట్ కి మంటలు, కారణమిదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus