Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో వైరల్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) .. టాలీవుడ్లో తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ ని మించిన స్టార్ లేడు.. మార్కెట్ పరంగా మరో హీరో ఎన్టీఆర్ దరిదాపుల్లోకి కూడా రాలేడు… ఇది వాస్తవం. ‘ఆర్.ఆర్.ఆర్’ తో అయితే ఎన్టీఆర్ క్రేజ్ దేశాలు దాటింది. నార్త్ లో కూడా ఎన్టీఆర్ కి భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ‘దేవర’ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు.

సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది.ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు చాలా అసలు పెట్టుకున్నారు. మరోపక్క వార్ 2 కోసం కూడా ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కి చిన్నప్పటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో 1997 లోనిది అని తెలుస్తుంది. 1997లో యూకే, మాంచెస్టర్‌లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ వేడుకల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నాడు.

సీనియర్‌ నటీమణులు శారద (Sarada) , జమున..ల పక్కన ఎన్టీఆర్ కూర్చున్నాడు. నిక్కర్లో ఎన్టీఆర్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియోలో ఎన్టీఆర్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు.ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 1997 తర్వాత 4 ఏళ్లకు అంటే 2001 లో ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ (Ninnu Choodalani) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ బొద్దుగా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోలో మాత్రం చాలా సన్నగా కనిపిస్తున్నాడు.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus