జూనియర్ ఎన్టీఆర్ (NTR) 17 సంవత్సరాల వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ సాధించడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. తారక్ కు చిన్న వయస్సులోనే నటనపై ఆసక్తి కలగగా అభయ్ రామ్, భార్గవ్ రామ్ సినీ ఎంట్రీ గురించి తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దడం నాకు నచ్చదని తారక్ పేర్కొన్నారు. అలా నేను చేయనని తారక్ కామెంట్లు చేశారు.
పిల్లలు సొంత ఆలోచనలను కలిగి ఉండాలని నేను నమ్ముతానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలని తారక్ అభిప్రాయపడ్డారు. ఇది చెయ్ అది చెయ్ అని పిల్లలకు అడ్డంకులు సృష్టించకూడదని తారక్ పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.
సినిమాల్లోనే అడుగుపెట్టాలని యాక్టింగ్ లోనే రాణించాలని వాళ్లను బలవంతం చేయనని ఎందుకంటే నా తల్లీదండ్రులు అలా చేయలేదని తారక్ పేర్కొన్నారు. ఏదో సాధించాలనుకున్నాడు చేయని అని నా పేరెంట్స్ అనుకున్నారని అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను గౌరవించాలని అనుకుంటున్నానని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసని తారక్ పేర్కొన్నారు. తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని పిల్లలు అనుకుంటారని తారక్ పేర్కొన్నారు.
ఇది సహజంగా జరుగుతుందని తారక్ తెలిపారు. దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. దేవర సీక్వెల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను అంచనాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండగా దేవర సినిమాకు తారక్ పాన్ ఇండియా స్థాయిలో చేసిన ప్రమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. దేవర హిందీ వెర్షన్ సైతం కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది. దసరా సెలవులు దేవర మూవీకి ఎంతగానో ప్లస్ కానున్నాయి.
దేవర సినిమా చూశాక నా భార్య & పిల్లలు రియాక్షన్!#JrNTR #Pranathi #AbhayRam #BhargavRam #Devara #FilmyFocus pic.twitter.com/x843Vy4enn
— Filmy Focus (@FilmyFocus) October 6, 2024