Jr NTR: లేటైనా లెక్క సరిచేస్తా.. తారక్ కాన్ఫిడెన్స్ ఇదేనా?

  • February 1, 2023 / 01:51 PM IST

గత నెలలో నూతన సంవత్సరం కానుకగా ఫిబ్రవరి నెల నుంచి ఎన్టీఆర్30 మూవీ షూటింగ్ మొదలుకానుందని షాకింగ్ అప్ డేట్ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆలస్యం కావడంతో పాటు షూట్ కూడా ఆలస్యమవుతోంది. అయితే నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వస్తుందని తారక్ కు పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ఉందని సమాచారం అందుతోంది. ఈ ఈవెంట్ కు హాజరు కావాలని తారక్ భావిస్తున్నారని సమాచారం.

ఈ ఈవెంట్ వల్లే తారక్30 షూట్ ఆలస్యమవుతోందని బోగట్టా. ఈ నెలాఖరున మూవీ షూట్ మొదలయ్యే అవకాశం ఉందని అలా చేయడం సాధ్యం కాకపోతే వచ్చే నెల ఫస్ట్ వీక్ లో షూట్ ను మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారని బోగట్టా. లేటైనా లెక్క సరి చేస్తానని తారక్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై తారక్ సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ తన టాలెంట్ ను ఈ సినిమాతో మరోసారి చూపించాలని భావిస్తున్నారు.

జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసే సినిమా ఇదేనని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో తారక్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు తారక్ కు రెండేళ్ల గ్యాప్ వస్తుండటంపై ఫ్యాన్స్ ఒకింత ఫీలవుతున్నారు.

అయితే తారక్ ఈ కామెంట్లకు కూడా చెక్ పెట్టనున్నారని తెలుస్తోంది. తారక్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా ఎన్టీఆర్ కొరటాల శివ కెరీర్ లో మరింత స్పెషల్ మూవీగా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus