ఎన్టీఆర్ అన్నంత పనీ చేశాడు!!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి నుంచి తాజా సినిమా జనతా గ్యారేజ్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…కధను నమ్మి, కొరటాల శివ ను నమ్మి తాను సినిమా చేశాను అని చెబుతూ వస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల అయిన రోజున కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, క్రమక్రమంగా ఈ సినిమా సూపర్ హిట్ సినిమాగా మారిపోయింది. కధనం కాస్త స్లో గా ఉన్నప్పటికీ సినిమాలో మంచి ఫీల్ ఉండడం, అదే క్రమంలో మెసేజ్ సైతం ఉండడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

అయితే మరో పక్క ఎన్టీఆర్ ఈ సినిమాతో సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇండియాలోనే కాకుండా ఓవెర్సీస్ లో కూడా ఎన్టీఆర్ తన స్టామినాను చూపించాడు. ముఖ్యంగా ఎన్ఆర్.ఐ ల టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వారు హీరో పరంగా కాకుండా సినిమా, కధ, కధనం బట్టి అక్కడ సక్సెస్ ను అందిస్తారు. అందుకే తాజాగా విడుదల అయిన ‘పెళ్లి చూపులు’ చిత్రం అక్కడ అంత పెద్ద హిట్ గా నిలిచింది.

ఇక ఈ క్రమంలో మాస్ హీరోగా ముద్రబడిపోయిన ఎన్టీఆర్ కు మిగిలిన హీరోలు పవన్, మహేష్, ప్రభాస్ లాగా అక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవడం, అదే క్రమంలో బాద్ షా సినిమాతో ఎన్టీఆర్ అక్కడ వారికి దగ్గర అవడంతో ఎన్టీఆర్ ప్రభంజనం అప్పుడు మొదలయింది. ఇక ఎన్టీఆర్ గత సినిమా నాన్నకు ప్రేమతో అక్కడ పవన్ అత్తారింటికి దారేదీ రికార్డులను బీట్ చేస్తే….ఇప్పుడు తాజాగా వచ్చిన జనతా పవన్ సర్దార్ రికార్డులను క్రాస్ చేసింది. మొత్తానికి ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఆయన కరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పకనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus