Jr NTR: తారక్‌ను బుచ్చిబాబు అలా చూపించబోతున్నాడా?

స్టార్‌ హీరో అయ్యాక ప్రయోగాలు చేయాలంటే మన తెలుగు హీరోలకు అంత త్వరగా మనసు రాదు అంటుంటారు. అయితే ఇలా ప్రయోగాలు చేస్తే ఆదరించే ప్రేక్షకులు అంతగా లేరు అనేది ఇది యాడ్‌ ఆన్‌ పాయింట్. ఈ విషయం పక్కనపెడితే.. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రయోగాలకు కుర్ర స్టార్‌ హీరోలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో దివ్యాంగులుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. అలా వచ్చిన సినిమాలకు ఆదరణ కూడా బాగుంటోంది అనుకోండి. ఇప్పుడు ఇలాంటి పనే తారక్‌ చేయబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

తారక్‌ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో ఎన్టీఆర్‌ నో చెప్పేశాడని, కాదు కాదు లైన్‌లోనే ఉంచాడని వార్తలొచ్చాయి. అయితే ఆఖరిగా తారక్‌ ఎస్‌ అన్నాడనే అంటున్నారు. ఈ సినిమాలో తారక్‌ స్పోర్స్ట్‌ మ్యాన్‌గా కనిపిస్తాడని కూడా మనం విన్నాం. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఛాంపియన్‌/ కోచ్‌గా కనిపిస్తాడని కూడా విన్నాం. అయితే ఈ పాత్రను బుచ్చిబాబు నెవర్‌ బిఫోర్‌గా రాసుకున్నారని టాక్‌.

రీసెంట్‌ పుకార్ల ప్రకారం చూస్తే.. ఈసినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ దివ్యాంగుడిగా కనిపిస్తాడని టాక్‌. తను సాధించలేనిది తన శిష్యులతో నెరవేర్చుకోవాలని వాళ్లతో ప్రాక్టీస్‌ చేయించి, కప్‌ సాధించేలా చూస్తాడట. అయితే ఎందుకు దివ్యాంగుడు అయ్యాడు, అయ్యాక ఏం చేశాడు, అసలేమైంది లాంటి అంశాలు సినిమాకు కీలకంగా ఉంటాయని అంటున్నారు. కబడ్డీ కాబట్టి ఈ సినిమా రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది అని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే… ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ఎన్టీఆర్‌ రిస్క్‌చేస్తున్నాడనే చెప్పొచ్చు.

అలాగే ‘ఉప్పెన’ లాంటి విజయం తర్వాత ఎంతో పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు కూడా పెద్ద రిస్క్‌ చేస్తున్నాడనే అనొచ్చు. స్టార్‌ హీరోను అలా చూపించే క్రమంలో తప్పులు చేస్తే కెరీర్‌ ఇబ్బందుల్లో పడుతుంది. అన్నట్లు ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. సుకుమార్‌ భాగస్వామ్యం కూడా ఉంటుందని అని అంటున్నారు. చూద్దాం ఒక వారంలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ అంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus