యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తాను చేసిన సహాయాలలో మెజారిటీ సహాయాలను చెప్పుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఒక ఆలయానికి భారీ మొత్తంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విరాళం ఇవ్వగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న ప్రముఖ ఆలయానికి తారక్ ఈ డొనేషన్ ఇచ్చారని భోగట్టా. ఆలయ నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం కోసం తారక్ ఏకంగా 12 లక్షల 50 వేల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
జగ్గన్నపేటలో కొంతకాలం క్రితం నిర్మించిన శ్రీ భద్రకాళీ సమేత ఆలయానికి సంబంధించిన విరాళాల వివరాలు తెలుపుతూ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. భారీ మొత్తంలో విరాళం ఇచ్చినా తారక్ ప్రచారం చేసుకోకపోవడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దేవర (Devara) ఫస్ట్ సింగిల్ గా మాస్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర కథకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేవర టీజర్ కోసం కూడా అభిమానులు ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తుండటం గమనార్హం. దేవర మూవీపై క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. దేవర సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయని సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో దేవర సినిమా ఒకటని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొరటాల శివ (Koratala Siva) ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారనే సంగతి తెలిసిందే. దేవర ఇతర భాషల్లో సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.