Jr NTR: హమ్మయ్యా.. ఇప్పటికైనా తారక్ మారాడుగా!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా మాస్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వయస్సు ప్రస్తుతం 38 సంవత్సరాలు కాగా గతంలో ఎన్టీఆర్ వయస్సుకు తగిన విధంగా స్టైలింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదనే కామెంట్లు వినిపించాయి. చరణ్, బన్నీ కొత్తకొత్త ఫ్యాషన్లతో కనిపిస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఎక్కువగా ఫార్మల్ షర్ట్స్ లో కనిపించారు. అయితే గత కొంతకాలం నుంచి ఎన్టీఆర్ ఈ విషయంలో పూర్తిగా మారిపోవడంతో తారక్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సమయంలో వైట్ కలర్ లో ఉండే ఫుల్ హ్యాండ్ టీషర్ట్, టార్న్ జీన్స్ లో కనిపించడంతో ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్ చాలా యంగ్ గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సైతం కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ తర్వాత సినిమాల డైరెక్టర్లు తారక్ ను స్టైలిష్ గా చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ తర్వాత సినిమా షూటింగ్ లో ఎప్పటినుంచి పాల్గొంటారో తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పటికే ఫైనల్ అయ్యారు. ఈ సినిమాలో అలియా భట్, కియారా అద్వానీ పేర్లు హీరోయిన్ పాత్ర కోసం వినిపిస్తుండగా ఎవరు ఫైనల్ అవుతారో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ కు జోడీగా కియారాను ఫిక్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus