Jr NTR, Mahesh Babu: మహేష్ పై ఒత్తిడి పెంచిన యంగ్ టైగర్..?

  • May 20, 2021 / 07:46 PM IST

పండుగల సమయంలో, ప్రత్యేక రోజులలో హీరోలు, దర్శకనిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లను ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో కొందరు హీరోలు తమ సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లను విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాల పోస్టర్లు నేడు విడుదల కావడంతో మహేష్ బాబుపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఆరోజు మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట టీజర్,

మహేష్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్, ఇతర సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు భారీ సర్ ప్రైజులు ఇవ్వడంతో ప్రేక్షకుల ఫోకస్ అంతా మహేష్ బాబు వైపు షిప్ట్ అయింది. ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్నాయి. మరోవైపు మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ జరగగా గోవా షెడ్యూల్ జరగాల్సి ఉంది.

మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో కూడా మహేష్ పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. అయితే వచ్చే ఏడాది మాత్రం మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ తో రిలీజ్ కానున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus