Jr NTR Family: ఆ దేశానికి పయనమైన యంగ్ టైగర్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు మూడేళ్లుగా పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వస్తుందని ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాతే తన కొత్త సినిమాల షూటింగ్ మొదలయ్యే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నారు. జెమినీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ ను సైతం తారక్ ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ కు వెకేషన్ కు వెళ్లారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా బిజీ షెడ్యూల్స్ తో గడిపిన తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. వెకేషన్ తర్వాత తారక్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ కానున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కనున్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజయ్యేలా ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్ తో సినిమాలను నిర్మించడానికి స్టార్ ప్రొడ్యూసర్లు సైతం తెగ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus