ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అన్ని ఏరియాలలో సలార్ మూవీ బుకింగ్స్ మొదలయ్యాయి. టికెట్ రేట్లు ఒకింత ఎక్కువగా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ డే సినిమా చూడటానికి ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. సలార్ రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సలార్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి తారక్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.
సలార్ ఇలా ఉంటే (Jr NTR) ఎన్టీఆర్ మూవీ ఎలా ఉంటుందో అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రశాంత్ నీల్ ఇప్పటికే చెప్పడంతో ఈ సినిమాను మరింత కొత్తగా ప్లాన్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సినిమాకు టాక్ కీలకం కానుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం బుకింగ్స్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కథనంతో పాటు కథతో కూడా మ్యాజిక్ చేస్తానని ప్రశాంత్ నీల్ కాన్ఫిడెన్స్ తో ఉండగా ఆ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. సలార్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డుంకీ సినిమాకు మాత్రం బుకింగ్స్ భారీ స్థాయిలో లేవు. సలార్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటంతో డుంకీని ఎవరూ పట్టించుకోవడం లేదు.
సలార్ మూవీ రికార్డులను క్రియేట్ చేసే మూవీగా నిలిచి ప్రేక్షకుల నమ్మకాన్ని నిజం చేస్తుందేమో చూడాల్సి ఉంది. సలార్ మూవీ ప్రమోషన్స్ లో వేగం పెరగడం ఫ్యాన్స్ ను సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ సలార్ రికార్డులను తిరగరాసే మూవీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విదేశాల్లో సైతం సలార్ మూవీ సంచలనాలు కొనసాగిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చేలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి..
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!