Jr NTR: ఆ ఇమేజ్ తో తారక్ రేంజ్ మరింత పెరగనుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఇతర రాష్ట్రాల ప్రేక్షకులకు, విదేశీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కొన్ని సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు అద్భుతమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు సైతం స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మరో ఇండస్ట్రీ హిట్ సాధిస్తే మాత్రం ఆయన రేంజ్ అంచనాలకు అందని స్థాయిలో మరింత పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కర్ణాటక రాష్ట్రంలో వీరాభిమానులు ఉన్నారు. తారక్ సినిమాలకు కర్ణాటకలో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మలయాళంలో కూడా తారక్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డబ్బింగ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులకు సుపరిచితమైన తారక్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత తారక్ నటించిన కొన్ని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ వీడియోలకు గతంలో ఏ వీడియోలకు రాని స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

తారక్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరితే తారక్ దూకుడుకు బ్రేకులు వేయడం ఎవరితరం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏ పాత్ర పోషించినా తన నటనతో ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళతారని ఇండస్ట్రీలో పేరుంది. తారక్ గత సినిమాలలో చాలా సినిమాలు యావరేజ్ కంటెంట్ తో తెరకెక్కినా తారక్ యాక్టింగ్ వల్ల సక్సెస్ సాధించాయి.

డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నా ధైర్యంగా సినిమా చేసి విజయాలను అందుకున్న హీరోగా తారక్ కు ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. ఎంతోమంది ఫ్యాన్స్ మెప్పును పొందిన తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుని కెరీర్ విషయంలో మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus