Devara: ఆ మూవీ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం దేవరకు సాధ్యమవుతుందా?

ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో దేవర సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేవర రిలీజ్ డేట్ వాయిదా గురించి వార్తలు వస్తుండగా ఆ ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. అక్టోబర్ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్టు ప్రకటన వెలువడింది. అయితే దేవర మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు. సినిమా రిలీజ్ ను మరీ ఆరు నెలలు వాయిదా వేయడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు 2013లో విడుదలైన రామయ్యా వస్తావయ్యా మూవీ రిలీజ్ డేట్ కు అటూఇటుగా దేవర సినిమా రిలీజ్ అవుతుండటంతో ఆ మూవీ సెంటిమెంట్ సైతం ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం దేవర మూవీకి సంబంధించిన అన్ని నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తానని నమ్మకంతో ఉన్నారు. దేవర సినిమా పార్ట్1 ఈ ఏడాది రిలీజ్ కానుండగా దేవర2 సినిమాకు సంబంధించిన క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.

సాంగ్స్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ లేని సీన్లను కొరటాల శివ మొదట షూట్ చేయనున్నారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్స్ట్స్ విషయంలో దేవర మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉన్నాయని తెలుస్తోంది. దేవర సినిమా ప్రమోషన్స్ మొదలుకావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దేవర సినిమాకు పోటీ ఉంటుందో లేదో కచ్చితంగా చెప్పలేం.

ప్రతి సంవత్సరం దసరాకు రెండు లేదా మూడు సినిమాలు విడుదల కావడం జరుగుతుంది. అయితే దేవరకు పోటీగా రిలీజ్ చేయడం అంటే కూడా రిస్క్ అనే సంగతి తెలిసిందే. (Devara) దేవర1 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus