Jr NTR: ట్విట్టర్ లో తారక్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో ప్రస్తుతం నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ త్వరలో వస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే దేవర టీజర్ ఎప్పుడు రిలీజవుతుందో అధికారికంగా క్లారిటీ లేకపోవడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్, దేవర అనే హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ మూవీ కథకు సంబంధించి షాకింగ్ విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సలార్, డంకీలతో పాటు దేవర టీజర్ విడుదలైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

2024 సమ్మర్ లో తారక్ దేవర సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తారక్ అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందేమో చూడాలి. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో సైతం ఈ సినిమా రిలీజ్ కానుంది. కొరటాల శివ కసితో పని చేస్తున్న ఈ సినిమా ఆయన కోరుకున్న భారీ విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

దేవర పార్ట్1 2024లో రిలీజ్ కానుండగా దేవర2 ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తారక్ సత్తా చాటుతుండగా కథల జడ్జిమెంట్ విషయంలో తారక్ అంచనాలు రైట్ అవుతున్నాయి. ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి విజయాలను అందుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తారక్ పలు ప్రముఖ కంపెనీల యాడ్స్ లో సైతం నటించి మెప్పిస్తున్నారు. ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో నటించనున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus