Jr NTR, Mahesh Babu: మహేష్ బాబు సినిమాల్లో తారక్ కు ఎంతో నచ్చిన సినిమా ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర1 సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా పూర్తైన వెంటనే వార్2 సినిమాతో తారక్ బిజీ కానున్నారు. వార్2 సినిమాలోని మెజారిటీ సన్నివేశాలను విదేశాల్లో షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ త్వరలో సెట్స్ లో జాయిన్ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన సినిమా ఏది అనే ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికేసింది.

అటు మహేష్ బాబు ఇటు ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన అతికొద్ది మంది దర్శకులలో కృష్ణవంశీ ఒకరనే సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు మురారి అంటే చాలా ఇష్టమని తెలిపారు. నాతో మురారి లాంటి సినిమా తీయాలని జూనియర్ ఎన్టీఆర్ అన్నారని కృష్ణవంశీ అన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు రాఖీ సినిమా కరెక్ట్ అని అందుకే నేను రాఖీ తీశానని కృష్ణవంశీ వెల్లడించడం వెల్లడించడం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో భవిష్యత్తులో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. సలార్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుండగా ఇతర భాషల్లో సైతం తారక్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus