అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా అభిమానులకోసం కొంత సమయం కేటాయిస్తున్నారు. జనతా గ్యారేజ్ షూటింగ్ సమయంలో తారక్ ఫ్యాన్స్ తో ఎక్కువసేపు ముచ్చటించారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం పాట చిత్రీకరణకు కేరళకు పయనమయ్యే పనిలో ఉండగా.. తన ఫ్యాన్ చావుతో పోరాడుతున్నాడని తెలిసి చలించిపోయాడు.

ప్రయాణాన్ని వాయిదా వేసుకొని తన అభిమాని వద్దకు బయలు దేరాడు. బెంగళూరుకు చెందిన నాగార్జునకు తక్కువ వయసులోనే క్యాన్సర్ అటాక్ అయింది.  ప్రస్తుతం వ్యాధి చివరి దశకు చేరుకుంది. ఆ మహమ్మారితో పోరాడి అలసి పోయిన నాగార్జున తన అభిమాన హీరో ఎన్టీఆర్ ని చూడాలనే ఆఖరి కోరికను బయటపెట్టాడు. ఆ విష్ గురించి తెలియగానే తారక్ స్పందించి అతన్ని ఇంటికి వెళ్లి కలిసాడు. కాసేపు మాట్లాడాడు. ధైర్యం చెప్పాడు. మంచి నీళ్లు తాగించాడు.

తాను ఆరాధించే నటుడు పక్కన కూర్చొనే సరికి నాగార్జునకు కళ్లు చెమ్మగిల్లాయి. ఇది వరకు నాగార్జున ఆరోగ్యం గా ఉన్నపుడు తారక్ ని కలిసి ఫోటోలు తీయించుకున్నాడు. ఇప్పుడు తన ఇంటికే యంగ్ టైగర్ రావడంతో అల్పాయుష్షు అభిమాని ఆనందపడ్డాడు. నాగార్జున కుటుంబ సభ్యులు తారక్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus