Jr NTR: రాజమౌళి రుణాన్ని తీర్చుకోబోతున్న యంగ్ టైగర్.. కానీ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి అంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఅర్, రాజమౌళి ప్రయాణం దాదాపుగా ఒకే సమయంలో మొదలైంది. స్టూడెంట్ నంబర్1 సినిమాతో అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు రాజమౌళికి తొలి సక్సెస్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కానీ రాజమౌళి కానీ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ లో తర్వాత రోజుల్లో తెరకెక్కిన సింహాద్రి, యమదొంగ, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు సైతం ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి.

రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో (Jr NTR) తారక్ నటించనున్నారని తెలుస్తోంది. రాజమౌళిపై అభిమానంతో ఈ పాత్రకు ఎన్టీఆర్ ఓకే చెప్పారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. నితిన్ కక్కర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో దాదా సాహెబ్ ఫాల్కే రోల్ లో తారక్ కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తారక్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్టు అధికారక ప్రకటన వస్తుందేమో చూడాలి. తారక్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి కూడా అవధులు ఉండవు. వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ ఈ ప్రాజెక్ట్ కు ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ సాధిస్తే రాజమౌళి మరిన్ని ప్రాజెక్ట్స్ దిశగా అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంది.

రాజమౌళి 2024 సంవత్సరంలో మహేష్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మహేష్ కు కెరీర్ బిగ్గెస్ట్ ఈ సినిమాతో సొంతమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus