సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే వారి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు. కొందరు అనుకోని విధంగా రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీలుగా మారిపోతారు. అలా రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్న వారిలో కిన్నెర మొగిలయ్య ఒకరు. ఎక్కడో మారుమూల గ్రామంలో తన తాత ముత్తాతల నుంచి వచ్చిన కలను వాడుకొని జీవనం కొనసాగిస్తున్న మొగిలయ్యకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న‘భీమ్లా నాయక్’ సినిమాలో ‘లాలా భీమ్లా’ అనే టైటిల్ పాట పాడే అవకాశాన్ని కల్పించారు.
ఈక్రమంలోనే మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిస్తూ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రికార్డులు సృష్టించింది. ఇక ఈ పాట ద్వారా ఈయన రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయనకు క్రమంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రధానం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ అవార్డుల లో భాగంగా కిన్నెర మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డును అందించడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇలా పద్మశ్రీ అవార్డు రావడంతో ఆయనకు మరింత పాపులారిటీ రావడమే కాకుండా తెలంగాణ సర్కార్ అతనిని గౌరవిస్తూ ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించింది.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కిన్నెర మొగిలయ్యకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకి త్వరలోనే తారక్ సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే తారక్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో భాగంగా కిన్నెర మొగిలయ్యతో ఒక పాట పాడించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈయనకు ఎంతో అద్భుతమైన అవకాశం వచ్చింది అనే చెప్పాలి. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!