తారక్ (Jr NTR) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి కాగా 350 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్ నెల నుంచి ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనుండగా తారక్ మాత్రం డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని మైత్రీ నిర్మాతల నుంచి సమాచారం అందుతోంది. మైత్రీ నిర్మాతలు అలా చెప్పడంతో వార్2 పూర్తయ్యే వరకు ప్రశాంత్ నీల్ మూవీ షూట్ లో తారక్ అడుగు పెట్టకపోవచ్చని తెలుస్తోంది.
Jr NTR:
వార్2 సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి తారక్ ప్రశాంత్ నీల్ సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితమయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. గత కొన్నేళ్లలో తారక్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో రిలీజ్ కాలేదు. అయితే ఇకపై మాత్రం ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా తారక్ ప్లానింగ్ ఉందని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాతే మరో సినిమాలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. తారక్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో, డైరెక్టర్స్ సెలక్షన్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
తారక్ ఇతర భాషల్లో మార్కెట్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటుండగా దేవర సినిమాకు ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర (Devara) సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర1 లో షాకింగ్ ట్విస్టులు ఉండనున్నాయని ఈ సినిమా కథ, కథనం అదిరిపోయాయని ఇండస్ట్రీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.