Jr NTR: ఆ విషయంలో ఎన్టీఆర్ గ్రేట్ అంటున్న అభిమానులు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న అగ్ర హీరోలలో ఒకరు. డిమాండ్ చేస్తే 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకోగల ప్రతిభ ఉన్న నటుడు. బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్లు సైతం తారక్ తో ఒక్క సినిమా అయినా తెరకెక్కించి రికార్డులు క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా నందమూరి హీరోలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్న హీరో తారక్ కావడం గమనార్హం.

అయితే తారక్ ను కొన్ని విషయాలకు సంబంధించి మెచ్చుకోకుండా ఉండలేమని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏ ఈవెంట్ జరిగినా ఫ్యాన్స్ క్షేమం గురించి మాట్లాడే హీరోలలో తారక్ ఒకరు. సినిమాసినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్నా సినిమా సక్సెస్ సాధిస్తే దర్శకులకు పూర్తి స్థాయిలో క్రెడిట్ ఇచ్చే హీరోగా తారక్ కు పేరుంది. దర్శకుడి గత సినిమా ఫ్లాపైనా ఛాన్స్ ఇస్తూ తారక్ దర్శకుల ఫేవరెట్ హీరోగా మారిపోతున్నారు.

మహిళలకు గౌరవం ఇచ్చే విషయంలో తారక్ ముందువరసలో ఉంటారు. తన గురించి నెగిటివ్ కథనాలు ప్రచారంలోకి వచ్చినా వాటి గురించి స్పందించకుండా మౌనం వహిస్తూ తన రేంజ్ ను తారక్ పెంచుకుంటున్నారు. సినిమాలతోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సింపుల్ గా జీవనం సాగిస్తూ ఇతర హీరోల ఫ్యాన్స్ హృదయాలను సైతం తారక్ గెలుచుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నవాళ్లకు తారక్ తన వంతు సహాయం చేస్తున్నారు.

తాను ఇతరులకు చేసే సహాయాల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్న తారక్ మంచి మనస్సును ప్రేక్షకులు సైతం మెచ్చుకుంటున్నారు. షో చేసినా, సినిమా చేసినా తన వంతు న్యాయం చేస్తూ సక్సెస్ సాధించడానికి తారక్ తన వంతు కృషి చేస్తున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న తారక్ మంచి మనస్సుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తారక్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూట్ అతి త్వరలో మొదలుకానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus