Jr NTR: జపాన్‌లో తెలుగు మాట.. పులకించిపోయిన తారక్‌.. ఏమైందంటే?

ఇండియన్‌ స్క్రీన్స్‌లో మంచి విజయం అందుకున్న ‘దేవర’ (Devara) సినిమాను ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల కోసం విడుదల చేశారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్న ఎన్టీఆర్‌కు (Jr NTR) ఓ ప్లజెంట్‌ సర్‌ప్రైజ్‌ ఎదురైంది. తన అభిమాని అయిన ఓ జపాన్‌ యువతి తారక్‌ను తెలుగులో పలకరించింది. దీంతో తారక్‌ చాలా ఆనందపడ్డాడు. ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా చూశాక రెండేళ్ల పాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నట్లు ఆమె చెప్పింది.

Jr NTR

తారక్‌తో జపాన్‌ యువతి తెలుగులో మాట్లాడిన విషయం గురించి ఓ వీడియోను ఎన్టీఆర్‌ సోషల్‌ మీడయిఆలో షేర్‌ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు. నా జపాన్‌ పర్యటనలు అందమైన జ్ఞాపకాల్ని అందిస్టూ ఉంటాయి. ఈసారి నాకు దక్కిన అనుభూతి మనసుని తాకింది. ఓ జపాన్‌ అభిమాని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూసి తెలుగు నేర్చుకున్నానని చెప్పింది. ఆ మాటలు వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది.

ఇలా రెండు భిన్న దేశాల సంస్కృతుల మధ్య వారధిగా ఉండటం ద్వారా సినిమా తన శక్తిని చాటిచెబుతోందని అన్నాడు. భాష, సినిమా ప్రేమికుడిగా ఒక అభిమాని తెలుగు భాష నేర్చుకోవడానికి సినిమా ప్రోత్సహించిందని చెప్పడం మరచిపోలేను అని అన్నాడు తారక్‌. ఇలాంటి వాటి కోసమే మన భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం అని కూడా చెప్పాడు.

ఇక తారక్‌ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌తో (Hrithik Roshan) హిందీలో ‘వార్‌ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్‌ అవుతుంది. అలాగే ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ చిత్రం (రూమర్డ్‌ టైటిల్‌ డ్రాగన్‌)లో నటిస్తున్నాడు. ఈ రెండూ అయ్యాక ‘దేవర 2’ మొదలవుతుంది అని చెబుతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ సినిమా మొదటి షెడ్యూల్‌ ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఇటీవల ప్రారంభమైంది. అయితే ఆ షెడ్యూల్‌లో తారక్‌ లేడు. త్వరలో సెట్స్‌లో అడుగుతుపెడతాడని సమాచారం.

ఒకటి, రెండు షోలు మాత్రమే పడ్డాయి.. అయినా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus