వైజాగ్ అభిమానులకి ఎన్టీఆర్ సర్ ప్రైజ్..!

ఎన్టీఆర్ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రంలో ఆయన కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. అయన ఎపిసోడ్ కు విలన్ పాత్రల కోసం ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌సన్‌ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే 70 శాతం పైనే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 2020 జూలై 30 న విడుదల చేయబోతున్నారు. అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య.. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Jr NTR heads to Vizag for RRR movie shoot

ఒక చిత్రీకరణలో భాగంగా ఓ కీలక షెడ్యూల్ కోసం … ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి వైజాగ్ కు బయల్దేరాడు ఎన్టీఆర్. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్.. మీడియా వారికి కంటపడటంతో ఆయన వైజాగ్ వెళుతున్నారనే సంగతి అభిమానులకు తెలిసిపోయింది. ఇక ఈ క్రమంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వైజాగ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని తెగ సందడి చేశారు. ఇలా ఎన్టీఆర్ కు ఘనస్వాగతం పలికారు. ఇక ఎయిర్ పోర్ట్ లోని ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus