పెళ్ళాం, పిల్లల కోసం తారక్ ఏం చేస్తున్నాడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏ పనినైనా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటాడు అని చాలా మంది దర్శకులు అలాగే అతని తోటి నటీనటులు చెబుతుంటారు. ‘అందుకే అతని సినిమాలు అంత ఫాస్ట్ గా ఫినిష్ అవుతాయని’ కూడా వారు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. అతి కష్టమైన డ్యాన్స్ లను కూడా ఎంతో ఈజ్ తో చేసేస్తుంటాడు. పేజీలకు పేజీల డైలాగ్ ను కూడా త్వరగా బట్టి పట్టి… దానిని ఓన్ చేసుకుని చెప్పేస్తుంటాడు. ఫైట్స్ విషయంలో కూడా అంతే..! అందుకే తారక్ ను ఇండస్ట్రీలో అందరూ.. ‘ఆల్ రౌండర్’ అని అంటుంటారు.

ప్రస్తుతం చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్.. లాక్ డౌన్ కారణంగా గత 3 నెలలుగా ఇంట్లోనే ఉంటూ వస్తున్నాడు. ఈ సమయాన్ని పూర్తిగా తన కుటుంబంతోనే గడుపుతున్నాడు ఎన్టీఆర్.తన ఇద్దరి కొడుకులతో ఆడుకుంటూనే మరోపక్క.. ‘ఆర్.ఆర్.ఆర్’ లో తన పాత్రకు మిగిలిన భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవడానికి గాను తమిళ్, మలయాళం వంటి భాషలను నేర్చుకుంటున్నాడట. అంతేకాదు తన తల్లి, భార్య, అలాగే కొడుకుల కోసం కొత్త కొత్త డిషెస్ ను కుక్ చేస్తున్నాడట.

ఈ 3 నెలలు ఎన్టీఆరే వంటలు చేస్తూ వస్తున్నాడట. తారక్ మంచి కుక్ అన్న సంగతి ‘బిగ్ బాస్’ ద్వారా అందరికీ తెలిసింది. తన తల్లికి, భార్యకు ‘ఈ లాక్ డౌన్ వేళ’ ఇలా సాయం చేసే అవకాశం వచ్చిందని తారక్ తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా తన పిల్లల కోసం.. యూట్యూబ్ లో చూసి కొత్త కొత్త స్నాక్స్ ను కూడా చేసి పెడుతున్నాడట. ‘లాక్ లో ఇదే నా బెస్ట్ హాబీ’ అని కూడా తారక్ చెబుతున్నట్టు సమాచారం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus