బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలయికలో ‘వార్ 2′ అనే క్రేజీ మల్టీస్టారర్ మూవీ రూపొందింది.’వార్ 2’ లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర పోషించాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఆదిత్య చోప్రా కథ అందించిన ఈ చిత్రానికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు. ఆల్రెడీ ‘వార్ 2’ నుండి గ్లింప్స్ బయటకొచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అది పూర్తి స్థాయిలో మెప్పించలేదు.
అందులో ఎక్కువగా ఎన్టీఆర్ ను ఎలివేట్ చేస్తారు అనుకుంటే హృతిక్ రోషన్, హీరోయిన్ కియారా అద్వానీని ఎక్కువ హైలెట్ చేశారు. ఎన్టీఆర్ లుక్స్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఏదేమైనా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి.. తెలుగులో ఈ చిత్రాన్ని నాగవంశీ భారీ రేటు పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. రూ.80 కోట్లు పెట్టి నాగవంశీ.. ఈ చిత్రం థియేటర్ హక్కులు కొనుగోలు చేశారు.
అయితే ‘వార్ 2’ ప్రమోషన్స్ కి సరిగ్గా నెల రోజులు మాత్రమే టైం ఉంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. కానీ చిత్ర బృందం మాత్రం ప్రమోషన్స్ విషయంలో తొందర పడటం లేదు. పాన్ ఇండియా సినిమాకి కచ్చితంగా నెల రోజుల నుండి ప్రమోషన్ అవసరం. పైగా పోటీగా రజినీకాంత్ ‘కూలి’ సినిమా వస్తుంది. దానిపైనే ఆడియన్స్ కి ఎక్కువ ఫోకస్ ఉంది. మొత్తానికి దీనిని ‘వార్ 2’ యూనిట్ గమనించింది.
అందుకే అతి త్వరలో హైదరాబాద్లో ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయనుంది. ఇందులో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ కూడా పాల్గొంటారు. ఆ రోజునే ‘వార్ 2’ టీజర్ లేదా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అటు తర్వాత ఎన్టీఆర్- హృతిక్ – కియారా..లతో ఓ కామన్ ఇంటర్వ్యూ కూడా చేసి వదులుతారట. అది మేటర్.