RX 100 Movie: ‘ఆర్.ఎక్స్.100’ కి ఫస్ట్ ఛాయిస్ కార్తికేయ కాదట.. ఆ ఇద్దరూ రిజెక్ట్ చేస్తేనే…!?

సాధారణంగా ఒక చిన్న సినిమా హిట్ అవ్వాలంటే.. కచ్చితంగా దానికి పెద్ద బ్యాకప్ కావాలి. ‘బలగం’ బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే దాని వెనుక దిల్ రాజు అనే పెద్ద బ్రాండ్ ఉంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే దాని వెనుక నిహారిక ఉంది. ఆమెకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఇలా ఏదో ఒక పెద్ద హ్యాండ్ ఇన్వాల్వ్ కాకపోతే చిన్న సినిమా బతికే పరిస్థితి లేదు టాలీవుడ్లో. అలాంటిది 2018 జూలై 12న ‘ఆర్.ఎక్స్.100’ అనే చిన్న సినిమా వచ్చింది. ఇందులో సీనియర్ నటులు రాంకీ, రావు రమేష్ తప్ప మిగిలిన వాళ్ళ మొహాలు జనాలకి పెద్దగా తెలీదు.

RX 100 Movie

అయినప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో హీరోయిన్ పాయల్, హీరో కార్తికేయ గుమ్మకొండ, దర్శకుడు అజయ్ భూపతి.. ఇలా అందరూ స్టార్స్ అయ్యారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, పాయల్ గ్లామర్, ఊహించని క్లైమాక్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. డిస్ట్రిబ్యూటర్లకు 5 రెట్లు లాభాలు మిగిల్చింది.

ఇలాంటి బ్లాక్ బస్టర్ ను కొంతమంది హీరోలు మిస్ చేసుకున్నారట. అవును ‘ఆర్.ఎక్స్.100’ కి ఫస్ట్ ఛాయిస్ కార్తికేయ కాదు. ముందుగా ఈ కథని శర్వానంద్ తో చేయాలని దర్శకుడు అజయ్ భూపతి ప్రయత్నించాడట. తర్వాత నవీన్ చంద్రకి కూడా కథ చెప్పాడట. కానీ వాళ్ళు ఈ కథపై ఇంట్రెస్ట్ చూపలేదు. ఫైనల్ గా కార్తికేయని పెట్టి తీశారు.

నిర్మాతలు కూడా అతని ఫ్యామిలీకి చెందినవారే. అలాగే హీరోయిన్ పాత్రకి ముందుగా నందిత శ్వేతని సంప్రదించారట. కానీ గ్లామర్ డోస్ ఎక్కువగా ఉందని భావించి ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. అందువల్ల పాయల్ ని తీసుకున్నారు. నేటితో ‘ఆర్.ఎక్స్.100’ రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus