Jr NTR: పాన్ ఇండియా సినిమా కోసం ఎన్టీఆర్ ప్లానింగ్!

టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ ఇప్పుడొక సమస్య వచ్చి పడింది. ఈ మధ్యకాలంలో అందరూ పాన్ ఇండియా సినిమాలే తీస్తున్నారు. ప్రభాస్ ‘బాహుబలి’తో మొదలుపెట్టిన ఈ ట్రెండ్ అందరు హీరోలు ఫాలో అవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుండడంతో తమ తదుపరి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా తీయాలని అనుకోవడం లేదు.

సినిమా మొత్తం పూర్తయ్యాక అప్పుడు దాని సంగతి ఆలోచిస్తారు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. అది పాన్ ఇండియా కథ అని తెలుస్తోంది. ఆ తరువాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలు చేస్తారనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఓ బాలీవుడ్ డైరెక్టర్ కోసం చూస్తున్నారట. సరైన బాలీవుడ్ దర్శకుడు దొరికితే మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.

కానీ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్స్ అంతా చాలా బిజీగా ఉన్నారు. మరో ఏడాది దాటితే గానీ వాళ్ల కమిట్మెంట్ దొరికే ఛాన్స్ లేదు. ఈలోగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అవుతుంది కాబట్టి అది చూసిన తరువాత బాలీవుడ్ నుండి ఎవరైనా ఎన్టీఆర్ కి కథ వినిపిస్తారేమో చూడాలి..!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus