Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాంటి ప్రయోగాత్మక పాత్రకు ఓకే చెప్పారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి తన నటనతో మెప్పించారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని రెండో పాత్రలో 75 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఎన్టీఆర్ 40 ఏళ్ల వయస్సులోనే 75 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపిస్తే ఆ పాత్ర కచ్చితంగా సంచలనం అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. వృద్ధుడైన డాన్ గా తారక్ పాత్ర ఉంటుందని సమాచారం అందుతోంది. అయితే త్వరలో ఇందుకు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

జూనియర్ ఎన్టీఆర్ సైతం సినిమా రేంజ్ పెరుగుతుందంటే సినిమా కోసం ఎంతైనా కష్టపడుతున్నారు. దేవర (Devara) సినిమా కోసం తారక్ దాదాపుగా రెండేళ్లు కష్టపడ్డారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వార్2 సినిమాకు సంబంధించి కూడా ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో సినిమాలు వేగంగా తెరకెక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజయ్యేలా తారక్ కెరీర్ ప్లాన్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ రికార్డ్స్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వృద్ధుడి పాత్ర అంటే ఎంతో రిస్క్ అని తారక్ ఇలాంటి రిస్కీ రోల్ చేయడం తొలిసారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus