సాధారణంగా ఏదైనా ఘటన జరిగితే వీలైనంత వేగంగా రియాక్ట్ అయ్యే సామర్థ్యం కొంతమందికి మాత్రమే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా అవసరాలకు, సమయానికి అనుగుణంగా రియాక్ట్ అవుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్తల్లో నిలుస్తున్నారు. అటు విరాళం ఇవ్వడంలోనూ ఇటు రియాక్ట్ కావడంలోనూ తారక్ ముందువరసలో నిలుస్తున్నారు. వరద బాధితులకు సహాయం విషయంలో తారక్ మొదట స్పందించారు. సమంతపై (Samantha) మంత్రి కామెంట్ల నేపథ్యంలో ఈ వివాదంతో సంబంధం లేకపోయినా ఘాటుగా రియాక్ట్ కావడం ద్వారా తారక్ వార్తల్లో నిలిచారు.
తారక్ స్పందించడం వల్ల సెలబ్రిటీలు సైతం ఒకింత ధైర్యంతో రియాక్ట్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. తారక్ మెచ్యూరిటీ లెవెల్స్ ను, పరిణతితో రియాక్ట్ అయిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర (Devara) మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
అధికార పార్టీ మంత్రికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నా తప్పు చేసిన వాళ్ల కోసం స్పందించకపోవడం ఇంకా పెద్ద తప్పు అని తారక్ భావించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సమయస్పూర్తితో వ్యవహరించడం ద్వారా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్రేక్ ఈవెన్ సాధించిన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.
తర్వాత సినిమాల లుక్స్ విషయంలో తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ సక్సెస్ మీట్ కు అనుమతులు లభించలేదని తెలుస్తోంది. దేవర సక్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంతో మేలు చేసింది. ఈ సినిమా రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రలకు అనుగుణంగా రిస్కీ షాట్స్ లో సైతం నటిస్తున్నారు.