Jr NTR: అందుకే అలా పిలవలేదన్న యంగ్ టైగర్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తొలి వారంతో పోలిస్తే రెండో వారం మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ షో రాబోయే రోజుల్లో భారీగా రేటింగ్స్ సాధిస్తుందని జెమినీ ఛానల్ నిర్వాహకులు, ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాలను కూడా చెబుతున్నారు. తాజాగా ఈ షోకు అంజనీ కుమార్ అనే వ్యక్తి హాజరు కాగా మిమ్మల్ని అజ్జూ అని పిలవాలా అని ఎన్టీఆర్ అడిగారు.

అవతలి వ్యక్తి అందరూ అజ్జు అనే పిలుస్తారని నాన్న మాత్రం అంజనీ కుమార్ అని పిలుస్తారని కంటెస్టెంట్ చెప్పారు. ఎన్టీఆర్ మంచి పేరు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టి పిలవడం చాలా మంచిదని అందువల్లే తనను ఎవరూ చిన్నప్పుడు ముద్దుపేర్లు పెట్టి పిలవలేదని యంగ్ టైగర్ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకుల ప్రశంసలను పొందుతున్నారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ షో ప్రసారం కానుండగా

ఎవరు మీలో కోటీశ్వరులు తర్వాత సీజన్లకు కూడా ఎన్టీఆర్ హోస్ట్ గా కొనసాగుతారేమో చూడాల్సి ఉంది. రాబోయే వారాల్లో ఈ షో రేటింగ్స్ ను బట్టి షో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలుస్తుంది. బిగ్ బాస్ షో నుంచి రేటింగ్స్ విషయంలో ఎవరు మీలో కోటీశ్వరులు షోకు గట్టి పోటీ ఎదురవుతోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus