Jr NTR, Prabhas: ప్రభాస్ ఫ్రెండ్స్ లిస్ట్ లో తారక్.. శ్యామలాదేవి అలా చెప్పడంతో?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కలిసి ఒకే స్టేట్ పై కనిపించిన సందర్భాలు తక్కువేననే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండగా ఈ ఇద్దరు హీరోలను కామన్ గా అభిమానించే ఫ్యాన్స్ సైతం ఉన్నారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ తారక్ మధ్య బాండింగ్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతుండటం గమనార్హం. ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేసి తారక్ ఎక్కడున్నావ్..

భోజనానికి వచ్చేయాలి అని అడుగుతాడని శ్యామలాదేవి పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ లో ఎక్కడున్నా వదలరని భోజనాలు పెట్టి చంపేస్తారు వీళ్లు అంటూ కామెంట్ చేస్తాడని ఆమె తెలిపారు. ప్రభాస్ తారక్ మధ్య ఇంత అనుబంధం ఉందని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ ఇద్దరు హీరోల కాంబోలో సినిమా రావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని సెట్స్ లో పని చేసే ప్రతి ఒక్కరికీ నచ్చే ఆహారం అందేలా చూస్తాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తుండటంతో ఆరు నెలల గ్యాప్ లో ప్రభాస్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. (Kalki 2898 AD) కల్కి 2898 ఏడీ, (Kannappa) కన్నప్ప, (The Rajasaab) రాజాసాబ్ సినిమాలతో ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (Salaar) సలార్2, స్పిరిట్ (Spirit) సినిమాల షూటింగ్ కూడా ఈ ఏడాదే మొదలుకానుందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలు వరుసగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఆ సినిమాలు నిర్మాతలకు మాత్రం మంచి లాభాలను అందిస్తున్నాయి.

ప్రభాస్ తో సినిమాలు తీయడానికి పోటీ పడే దర్శకుల సంఖ్య పెరుగుతోంది. ప్రభాస్ సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus