Jr NTR: అక్కడి యాడ్స్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ గర్వపడేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని పాన్ ఇండియా హీరోలలో ఒకరు కాగా ఇతర భాషల్లో కూడా తారక్ కు మంచి గుర్తింపు ఉంది. తారక్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫిదా అయ్యారు. ఈ మధ్య కాలంలో తారక్ నటిస్తున్న సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర హీరోలు సైతం తారక్ గురించి మాట్లాడే ఛాన్స్ వస్తే గొప్పగా చెబుతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

కర్ణాటక సర్కార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న పురస్కారంను ప్రధానం చేస్తోంది. ఈరోజు కర్ణాటక దినోత్సవం కావడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ పురస్కారంను ప్రధానం చేస్తుండటం గమనార్హం. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, సుధామూర్తి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లకు ఆహ్వానం అందింది. కర్ణాటక సర్కార్ ఈరోజు అన్ని ప్రముఖ పత్రికలలో ఈ వేడుక గురించి యాడ్స్ ఇవ్వడం గమనార్హం.

ఈ యాడ్ లో పునీత్ రాజ్ కుమార్ ఫోటోతో పాటు అతిథులుగా హాజరైన రజనీకాంత్, తారక్ ఫోటోలు కూడా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన పత్రికల్లో మరో రాష్ట్రానికి చెందిన స్టార్ హీరో ఫోటోను ప్రచురించి గౌరవం ఇవ్వడం తారక్ విషయంలోనే జరిగిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తారక్ కు ఈ అరుదైన గుర్తింపు దక్కడంతో సంతోషిస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో కూడా అనర్గళంగా మాట్లాడగలరనే సంగతి తెలిసిందే. తారక్ తల్లి షాలిని స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోకి కుందాపూర్ అనే సంగతి తెలిసిందే. మరోవైపు తారక్ త్వరలో తన కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వనున్నారని బోగట్టా. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus