Jr NTR, Koratala Siva: వామ్మో.. అన్ని భాషల్లో తారక్ మూవీ రిలీజ్ కానుందా?

తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కనుండగా నవంబర్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 250 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. సోలో హీరోగా తారక్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా ఏకంగా తొమ్మిది భాషల్లో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. అన్ని భాషల ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తారని బోగట్టా.

అటు కొరటాల శివ ఇటు తారక్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాలో సీజీ వర్క్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది. కొరటాల స్నేహితుడు సుధాకర్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి క్లారిటీ రానుంది.

తారక్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ సినిమాల హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని సమాచారం అందుతోంది. ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తిగా కొరటాల శివను నిందించలేము. కథలో చేసిన మార్పులు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. తారక్ సినిమా కథ విషయంలో మాత్రం కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కొరటాల శివ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఇండస్ట్రీ హిట్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు కొరటాల శివకు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. మరోవైపు తారక్ ఆచితూచి కొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటున్నారు. తారక్ ఈ సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus