NTR, Koratala: తారక్‌ – కొరటాల సినిమాలోకి కొత్త ప్రొడ్యూసర్‌ నిజం కాదా!

తారక్‌ – కొరటాల శివ సినిమా గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ అయిపోయిన వెంటనే ఈ సినిమా మొదలు అని వార్తలొచ్చాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్‌ అయిపోయి, ఇప్పుడు జపాన్‌లోనూ విడుదలైంది. అయినా ఇంకా సినిమా మొదలవ్వలేదు. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి. అవి కాసేపు పక్కనపెడితే.. ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం నవంబరులోనూ సినిమా మొదలవ్వడం కష్టం అని అంటున్నారు. కొంతమంది అయితే ఫిబ్రవరి నుండి ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

కొరటాల శివ సినిమా ఉందా? లేదా? అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. దీనికి తెరదించుతూ చిత్రబృందం ఓ ఫొటోను విడుదల చేసింది. అందులో ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌, ఛాయాగ్రాహకుడు రత్నవేలుతో కలిసి కొరటాల కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంటే సినిమా ఆగిపోలేదు అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది టీమ్‌. అయితే ఇక్కడే ఓ విషయం గమనించాలి. అదే.. సినిమా ఇంకా షూటింగ్‌కి రెడీ అవ్వలేదని. ఇప్పుడు ప్రొడక్షన్‌ డిజైనర్‌, సినిమాటోగ్రాఫర్‌తో మాటలు అంటే.. ఇంకా పనులు ఓ కొలిక్కి రాలేదని చెప్పొచ్చు.

ఎన్టీఆర్‌ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఓ శక్తివంతమైన కథతో సినిమా రూపొందనుంది. కథపై చిత్ర బృందమంతా నమ్మకంగా ఉంది. త్వరలో సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతాం అని సినిమా వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ నెల సినిమా షూటింగ్‌ మొదలు అంటూ గత నాలుగైదు నెలలుగా చెబుతూనే ఉన్నారు. అయితే సినిమా అసలు సమయానికి వచ్చినప్పటికి మొదలవ్వడం లేదు. ఇప్పుడు మరోసారి డిస్కషన్‌ స్టేట్‌లోనే ఉంది అని చెబుతున్నారు. దీంతో నవంబరులో సినిమా ప్రారంభం అవ్వదు అని అంటున్నారు.

అయితే ఇక్కడో ఆనందించే విషయం ఏంటంటే.. సినిమా కథ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తితో ఉన్నారని, కథ మార్చమంటున్నారు అని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటికి చెక్‌ పడింది. అయితే సినిమా ఎప్పుడు మొదలు అనే విషయం కూడా చెప్పేస్తే.. అభిమానులకు ఇంకా హ్యాపీ. తారక్‌.. కాస్త చెప్పొచ్చు కదా.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus