“ఎన్టీఆర్” ఆలోచనకు “మెగాస్టార్” షాక్!!!

మెగా ఫ్యామిలీ ఆడియో వేడుకలకి మెగా హీరోస్ వస్తే బావుంటుంది. నందమూరి ఫ్యామిలీ వేడుకలకి నందమూరి హీరోలు హాజరు అయితే అభిమానులకు ఆ కిక్కె వేరుగా ఉంటుంది. అయితే నందమూరి హీరోల ఫంక్షన్స్ కి మెగా ఫ్యామిలీ హీరో అటెండ్ అయితే ఎలా ఉంటుంది….ఎవ్వరూ ఊహించని ఆలోచన కదా…అలాంటి ఆలోచనే మన ఎన్టీఆర్ కు వచ్చింది. విషయం ఏమిటంటే….వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అన్న కసితొ పనిచేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఒక పక్క ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న ఈ ఆడియో వేడుకకి ఎన్టీఆర్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు అని టాక్. అదేమిటంటే…ఈ ఆడియో వేడుకకి మెగాస్టార్ చిరంజీవినీ ముఖ్య అతిధిగా ఆహ్వానించాలి అని. ఒక పక్క మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వస్తూ ఉండంగా చిరుని సైతం పిలిస్తే బావుతుంది అని ఎన్టీఆర్ అనుకున్నాడని ఇండస్ట్రీ టాక్. అయితే దానికి గల కారణాలు సైతం లేకపోలేదు, తాజాగా జరిగిన సినీ మా అవార్డ్స్ ఫంక్షన్ వేధికలో జూనియర్, మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు.

అలాగే జూనియర్ నటిస్తున్న జనత గ్యారేజ్ మూవీ గురించి మెగాస్టార్ సైతం వివరాలను అడిగి తెలుసుకోవటం చాలా ఆశ్ఛర్యాన్ని కలిగించింది. అదే క్రమంలో చిరు ని ఆడియోకి చీఫ్ గెస్ట్ గా ప్లిస్తే బావుంటుంది అని ఎన్టీఆర్ భావించినా ఆ తరువాత ఎందుకో ఆ ఆలోచనని విరమించుకున్నాడని, ఇక ఎన్టీఆర్ ఆలోచనని చూసి మెగాస్టార్ సైతం షాక్ అయినట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus