టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆలస్యమవుతుంది ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానుల ముందుకు ఇప్పుడే రారని తెలిసి అభిమానులు కూడా చాలా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన అభిమానులను సందడి చేయడం కోసం ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్ కూడా చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ మెక్ డోనాల్డ్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మరొక ఆడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ఎన్టీఆర్ తన మేకోవర్ మొత్తం మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ అదిరిపోయిన లుక్ లో కనిపిస్తున్నారు.
ఈ యాడ్ షూట్ కోసం (Jr NTR) ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఆయనని అలా తయారు చేశారు. గుబురు గడ్డం, కళ్ళకి గ్లాసెస్‌తో ఎన్టీఆర్ కూర్చున్న తీరు చూస్తుంటే.. టైగర్ తీక్షణంగా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఈ ఫోటోని అలీమ్ హకీమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ అవుతుంది.
ఈ ఫోటో చూసినటువంటి తారక్ ఫ్యాన్స్ అసలు ఏమున్నాడ్రా బాబు అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఏ యాడ్ షూట్ కోసం ఇలాంటి లుక్ లో కనిపించబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా కూడా ఈయన ఎంతో బిజీగా ఉన్నారు. దేవర సినిమాతో పాటు వార్ 2,అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కూడా మరొక సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసింది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!