Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్.. ఫ్యాన్స్ మాత్రం నాట్ హ్యాపీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కొత్త యాడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ డెలివరీ సర్వీస్ జెప్టో కోసం ఎన్టీఆర్ చేసిన ఈ బ్రాండ్ కమర్షియల్ ఇటీవల విడుదలైంది. అయితే యాడ్ కంటే ఎక్కువగా ఎన్టీఆర్ లుక్‌పై చర్చ జరుగుతోంది. అభిమానులు ఊహించినట్టుగా పవర్‌ఫుల్ స్టైల్ కాకుండా, కాస్త డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ యాడ్‌లో ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్‌తో ప్రెజెంటేషన్ కొత్తగా ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ లుక్ మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను తెచ్చుకుంది.

Jr NTR

సాధారణంగా ఎన్టీఆర్ స్టైలింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. కానీ ఈ యాడ్‌లో నీలం రంగు హుడ్‌తో, కాస్త వింతగా ఉన్న హెయిర్ స్టైల్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచలేదు. యాడ్ ఫన్నీ టోన్‌లో ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ గెటప్ కాస్త అన్‌సెట్‌లింగ్‌గా అనిపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ అయితే మరింత నెగటివ్‌గా స్పందిస్తూ, ఇది ఎన్టీఆర్ లుక్‌కి అస్సలు సూట్ అవ్వలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ యాడ్ తర్వాత ఎన్టీఆర్ లుక్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. ప్రత్యేకించి RRR తర్వాత, ఆయన నుండి వస్తున్న ప్రతి చిన్న అప్‌డేట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. వార్ 2, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా వంటి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్, కమర్షియల్ బ్రాండ్ డీల్స్ కూడా రెగ్యులర్‌గా చేస్తూ, తన పాన్ ఇండియా మార్కెట్‌ను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే జెప్టో యాడ్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా లేదనే అభిప్రాయం బలపడుతోంది. ఇప్పుడున్న స్టార్ క్రేజ్‌ను బ్రాండ్ ప్రమోషన్‌లో ఎలా వాడుకోవాలో నిర్మాతలు, బ్రాండ్ యాజమాన్యాలు మరింత జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తక్కువ కాలంలోనే మిలియన్ వ్యూస్ సాధించినా, ఈ యాడ్ మాత్రం అభిమానులను పూర్తిగా మెప్పించలేదనడంలో సందేహం లేదు.

విశ్వంభర.. మెగా డేట్ ఫిక్స్ అయినట్లేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus