Jr NTR: తారక్‌ కొత్త సినిమా ఎప్పుడు మొదలంటే..!

ఎన్టీఆర్‌ – కొరటాల శివ సినిమా అనౌన్స్‌ అయ్యి చాలా రోజులైంది. కానీ ఎప్పుడు ప్రారంభం అనే విషయం మాత్రం ఇంకా తేలడం లేదు. ఇదిగో రేపు, ఎల్లుండి అంటూ వార్తలొస్తున్నాయి కానీ… ఎక్కడా సరైన సమాచారం రావడం లేదు. అయితే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు అయితే వేగంగా సాగుతున్నాయని సమాచారం. అంతేకాదు సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి ముహూర్తం కూడా పెట్టేశారట. అంతేకాదు దీని కోసం ఓ సెట్‌ కూడా వేస్తున్నారట.

కొరటాల సినిమాలో కథతోపాటు, హీరో ఉండే ప్రదేశానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. ఆయన గత సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ ప్రదేశం కోసం కొరటాల బాగానే ఖర్చు పెట్టించి.. సెట్స్‌ వేయిస్తుంటాడు. తాజాగా ఎన్టీఆర్‌ సినిమా కోసం కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని వార్తలొచ్చాయి. ఇదెంతవరకు కరెక్ట్‌ అనేది తెలియదు కానీ ఈ సినిమా కోసమైతే పెద్ద సెట్‌ వేస్తున్నారట.

ఎన్టీఆర్‌ ఇంటికి దగ్గరలోనే కొత్త సినిమా సెట్‌ రూపొందిస్తున్నారట. ఎంత దగ్గర అంటే… షాట్ ఓకే అయ్యి ఫోన్‌ చేస్తే తారక్‌ వెంటనే వచ్చేసేంత దగ్గరట. అంతేకాదు ఈ సినిమాను దసరా సందర్భంగా మొదలుపెట్టాలని చూస్తున్నారట. నవంబరులో సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. చూద్దాం… ఈసారైనా లీక్‌ అయిన డేట్‌ పక్కా అవ్వాలని కోరుకుందాం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus