అన్నయ్య కోసం ఎన్టీఆర్ త్యాగం!

  • July 21, 2016 / 05:59 AM IST

నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో త‌న స్టామినాని మ‌రోసారి ప్రూవ్ చేసుకొన్నాడు. జ‌న‌తా గ్యారేజీకి జ‌రుగుతున్న బిజినెస్ కూడా ఎన్టీఆర్ క్రేజ్‌కి అద్దం ప‌డుతుంది. ఎంత కాద‌న్నా… ఎన్టీఆర్‌కి 15 నుంచి 18 కోట్ల వ‌ర‌కూ పారితోషికం ఇవ్వాల్సిందే. అయితే.. ఈసారి మాత్రం ఎన్టీఆర్ పారితోషికం తీసుకోవ‌డం లేదు. ఫ్రీగానే సినిమా చేస్తున్నాడు. అదీ.. అన్న‌య్య క‌ల్యాణ్‌రామ్ కోసం.

క‌ల్యాణ్‌రామ్ సొంత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆల్రెడీ క‌థ లాక్ అయిపోయింది. వ‌క్కంతం వంశీ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ పారితోషికం తీసుకోవ‌డం లేద‌ట‌. కిక్ 2తో భారీ గా న‌ష్ట‌పోయాడు క‌ల్యాణ్‌రామ్‌. ఆ ద‌శ‌లో అన్న‌ని ఆదుకొన్న‌ది ఎన్టీఆరే. ఈసారీ.. క‌ల్యాణ్‌రామ్‌ని ఆదుకొనే బాధ్య‌త తాను తీసుకొన్నాడు. అయితే లాభాల్లో మాత్రం ఎన్టీఆర్‌కి వాటా ఇవ్వాల‌ని క‌ల్యాణ్‌రామ్ భావిస్తున్నాడ‌ట‌.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus