ఎన్టీఆర్ – బాలయ్య మధ్య మనస్పర్థలు క్లియర్ అయినట్టేనా?

బాలయ్య సినిమాల్లో తప్ప ఇలాంటి అతి ఉన్న సన్నివేశాలు మరే హీరో సినిమాలోనూ ఉండవు అనడానికి కావాలనే ఎటకారంగా అలా పిలుస్తూ ఉంటారు. అయితే బాలయ్య సినిమాలో మాత్రమే అలాంటి అతి కలిగిన సీన్లు ఉంటాయి అనడం పెద్ద తప్పు. ‘కోడి గుడ్డు మీద ఈకలు వెతికినట్టు’ కొందరు కావాలనే అలా టార్గెట్ చేస్తుంటారు.

అయితే ఈ మధ్యకాలంలో కుర్ర హీరోలు కూడా ‘జై బాలయ్య’ అనడం మొదలు పెట్టారు. అది బాలయ్య పై గౌరవంతో అంటున్నారో.. లేక ఎటకారంగా అంటున్నారో తెలీదు. 2018 డిసెంబర్ లో జరిగిన రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళిలో కూడా కొందరు ‘జై బాలయ్య’ అని అరిచిన సందర్భం ఉంది. ఇది పక్కన పెట్టేస్తే.. ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో.. సెలబ్రిటీలు అంతా ట్వీట్లు వేశారు. అందులో మన ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ‘నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK’ అంటూ ట్వీట్ చేసాడు తారక్. ‘అంతా బానే ఉంది.. చివర్లో ‘జై బాలయ్య’ అంటూ ఆ ఎటకారం ఎందుకు’ అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ట్వీట్ వెయ్యకపోతే బాగోదు అన్నట్టు.. ఓ ట్వీట్ వేసి చివర్లో ఆ ఎటకారం జోడించాడు తారక్’ అని స్పందించేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘ఎన్టీఆర్, బాలయ్య మధ్యలో మనస్పర్థలు తొలగిపోయాయి అని అంతా అనుకుంటుంటే.. ఎన్టీఆర్ మాత్రమే కావాలని బాలయ్యతో కలవట్లేదనుకుంట?’ అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ‘జై బాలయ్య’ అని ఎన్టీఆర్ పెట్టడం వల్ల ఎన్ని అనుమానాలు వ్యక్తం అవుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus