త్వరలో ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్లో సినిమా
- February 6, 2017 / 11:44 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కలిశారంటే సూపర్ హిట్ గ్యారంటీ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో తారక్ నటించిన సాంబ నిరాశ పరిచినప్పటికీ.. వీరి కలయికలో వచ్చిన అదుర్స్ మూవీ భారీ కలక్షన్స్ రాబట్టింది. ఇందులో ఎన్టీఆర్ టు షేడ్స్ అందరినీ అలరించాయి. మళ్లీ వీరిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా..? అని ఆరేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారి కోరిక త్వరలో తీరనుంది. వినాయక్, ఎన్టీఆర్ ప్రస్తుతం కథ చర్చల్లో ఉన్నారని తెలిసింది. అది అదుర్స్ కి సీక్వెలా? దాన వీర సూర కర్ణ మూవీ రీమేకా?, లేక కొత్త కథ అనేది ఇంకా బయటికి రాలేదు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రకటించాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం తారక్ బాబీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 10 నుంచి రెగ్యురల్ షూటింగ్ జరుపుకోనుంది. అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్లో ఎన్టీఆర్ నటించాలి. అయితే త్రివిక్రమ్ మెగా మల్టీ స్టారర్ మూవీకి లాక్ కావడంతో అతను తప్పుకునే అవకాశాలున్నాయి. సో ఆ సినిమా కోసం అనుకున్న డేట్స్ ని వినాయక్ కి ఇవ్వాలని తారక్ ఆలోచిస్తున్నట్లు అతని సన్నిహితులు వెల్లడించారు. ఈ కాంబో సెట్ అయితే మరో బంపర్ హిట్ కోసం నందమూరి అభిమానులు రెడీగా ఉండాలన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















