Jr NTR: దేవర మూవీ కోసం ఎన్టీఆర్ ప్లాన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా ప్రమోషన్స్ విషయంలో తారక్ ప్లాన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రెండు నెలల సమయం కేటాయిస్తున్నారని సమాచారం అందుతోంది. 27 ప్రదేశాల్లో ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు, ఈవెంట్లను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సైతం వెళ్లి తారక్ ఈ సినిమా ప్రమోషన్స్ చేయనున్నారని అక్కడ సినిమాను ప్రమోట్ చేసిన తొలి తెలుగు హీరోగా తారక్ కు గుర్తింపు దక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర సినిమాకు సంబంధించి నాలుగు పాటల షూట్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. కొన్ని యాక్షన్స్ సీన్స్ ను సైతం షూట్ చేయాలని ఉందని భోగట్టా. దేవర సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు భాషతో సంబంధం లేకుండా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేవర గ్లింప్స్ కు ఏకంగా 34 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

షైన్ టామ్ చాకో కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం. జాన్వీ కపూర్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉందని తెలుస్తోంది. దేవర1 ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుండగా దేవర2 మూవీ 2026 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉండనుందని సమాచారం అందుతోంది.

కళ్యాణ్ రామ్ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయగా గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు సినిమాలో ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది. శివరాత్రి రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి స్పష్టత రానుంది.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus