Jr NTR , Prashanth Neel: మహేష్ పుట్టినరోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త.. సస్పెన్స్ కు తెర దించారుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) అభిమానులు దేవర సినిమా కంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు సినిమాలకు సంబంధించి ఒకింత కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో ఆ కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆగష్టు నెల 9వ తేదీ ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ లాంఛ్ డేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆరోజు పూజా కార్యక్రమాలు జరిగితే షూటింగ్ కు సంబంధించి, టైటిల్, హీరోయిన్, ఇతర నటీనటులకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఒకింత పవర్ ఫుల్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మహేష్ (Mahesh Babu) పుట్టినరోజున ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాల దిశగా అడుగులు పడుతుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. మైత్రీ నిర్మాతలు, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఆగష్టు నెల 9వ తేదీ ఎన్టీఆర్ అభిమానులకు ఒకింత స్పెషల్ డే అని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. మహేష్ పుట్టినరోజున తారక్ శుభవార్త చెబుతుండటం మహేష్ అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 350 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్లు రానున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus