Jr NTR, Rajamouli, Koratala Siva: కొరటాల, జక్కన్నతో రచ్చ చేసిన తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మూడు వారాల నుంచి జెమిని ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతోంది. వారంవారానికి రేటింగ్స్ పెరుగుతుండటంతో రాబోయే వారాల్లో ఈ షో భారీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజ్ఞానాన్ని పంచే షో కావడం, ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా హోస్ట్ చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులు సైతం ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో రాజమౌళి, కొరటాల శివ సందడి చేశారు.

ఎన్టీఆర్ తన సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లను ఒకేచోట చేర్చి రచ్చరచ్చ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటూ ఇద్దరు దర్శకులను ఆహ్వానించిన తారక్ రాజమౌళి, కొరటాల శివ రోల్ కెమెరా, సౌండ్ అని చెప్పడంతో షాకవుతారు. కొరటాల శివ, రాజమౌళి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండటంతో ఆప్షన్స్ ఇవ్వకుండా క్వశ్చన్ క్యాన్సిల్ చేస్తానని ఎన్టీఆర్ సరదాగా చెబుతారు. మీరు ఎలా డిస్కస్ చేసుకుంటారంటూ ఎన్టీఆర్ గోలగోల చేస్తాడు.

ఇక్కడ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది, నేనే ఇక్కడ బాస్ అంటూ ఎన్టీఆర్ సందడి చేస్తారు. రాజమౌళి, కొరటాల శివ ఎంట్రీతో ఈ షోకు భారీగా రేటింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన తారక్ వచ్చే నెల నుంచి కొరటాల శివ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus