Jr NTR, Rajamouli: అరుదైన ఘనత సాధించిన ఎన్టీఆర్, రాజమౌళి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిలకు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రాజమౌళి కెరీర్ పరంగా వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. హాలీవుడ్ మ్యాగ‌జైన్ వెరైటీ 500 జాబితాలో తారక్, జక్కన్న నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. వేర్వేరుగా వీళ్లిద్దరూ ఈ జాబితాలో నిలవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. సౌత్ నుంచి ఒక హీరో ఈ ఘనత సాధించడం ఎన్టీఆర్ విషయంలోనే జరిగిందని సమాచారం.

హాలీవుడ్ మ్యాగ‌జైన్ వెరైటీ 500 జాబితాలో తారక్, జక్కన్న నిలవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. తారక్ తో జక్కన్న మరో సినిమా తీస్తారేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూట్ ఆగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ (Jr NTR) లేదా దేవర టీం స్పందిస్తే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది.

మరోవైపు ఈ సినిమా బిజినెస్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. దేవర సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇలా భారీస్థాయిలో గుర్తింపు ఉన్న నటులు నటించడం వల్ల ఈ సినిమాకు బిజినెస్ విషయంలో సైతం కలిసొస్తోంది. దేవర గ్లింప్స్ త్వరలో రిలీజ్ కానుండగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర సినిమా ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేయనుందో చూడాల్సి ఉంది. దేవర సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ సైతం దేవర సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు ఒక నిర్మాతగా ఉన్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus