యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ కచ్చితంగా వచ్చే ఏడాది రిలీజవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఆంధ్రా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. మరో మూడు నెలల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. మరోవైపు జక్కన్న సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఆర్ఆర్ఆర్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని భావిస్తున్నారు.
సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ కు పోటీగా రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. జీ5, నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేశాయి. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ తో పాటు స్పానిష్, టర్కిష్, పోర్చుగీస్, కొరియన్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. సంక్రాంతికి ఇప్పటికే రిలీజ్ డేట్లను ప్రకటించిన రెండు సినిమాలను తప్పించి ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తున్న జక్కన్న మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!