Jr NTR: యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. చిన్న వయస్సులోనే మాస్ సినిమాలలో నటించడంతో పాటు ఆ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకుని ఎంతోమంది అభిమానులకు తారక్ ఫేవరెట్ హీరోగా మారారు. ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలోని భీమ్ పాత్రలో తారక్ తన నటనతో అదరగొట్టారు. కొన్ని సీన్లలో అమాయకంగా మరికొన్ని సీన్లలో పవర్ ఫుల్ గా కనిపించే ఆ పాత్రకు తారక్ పూర్తిస్థాయిలో న్యాయం చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా విజయంతో బాలీవుడ్ ఆడియన్స్ కు సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరింత చేరువయ్యారు. ఆర్మాక్స్ మీడియా కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ నటులు ఎవరనే సర్వే నిర్వహించగా ఈ సర్వేలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నంబర్ 1 స్థానంలో నిలిచారనే సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలకు సంబంధించిన సర్వేలో టాలీవుడ్ స్టార్స్ వరకు ఎన్టీఆర్ కు నంబర్ 1 స్థానం సొంతమైంది.

అయితే ఆర్మాక్స్ మీడియా ఇండియాలో మోస్ట్ పాపులర్ స్టార్స్ కు సంబంధించి నిర్వహించిన సర్వేలో ఎన్టీఆర్ నంబర్ 2 స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తొలి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నిలవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఏ స్థాయిలో ప్రేక్షకులకు దగ్గరయ్యారో చెప్పటానికి ఈ సర్వే ఫలితాలే నిదర్శనమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో సక్సెస్ సాధించడంతో పాటు తనపై వ్యక్తమైన విమర్శలకు చెక్ పెట్టాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus